![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి డాన్సర్స్ అమ్మ రాజశేఖర్, భాను మాస్టర్, యాని మాస్టర్, రఘు మాస్టర్ స్టేజి మెడకు ఎంట్రీ ఇచ్చారు. "యాని మాస్టర్ మీది లవ్ మ్యారేజ్ కదా మీ లవ్ స్టోరీ చెప్పండి" అని సుమ అడిగేసరికి "ఆయన చూసారు, నేను చూసాను ఐపోయింది" అని కామెడీ ఫేస్ తో చెప్పేసరికి "చూసారు, చూసారు, చేశారు" అంటూ అమ్మ రాజశేఖర్ ఇంకా కామెడీగా చెప్పాడు. "ఎక్కడ కలిశారు మీరిద్దరూ" అని మళ్ళీ సుమ అడిగింది "ఏదో ఫంక్షన్ లో చూసుకున్నాం" అని చెప్పింది యాని మాస్టర్.
"దొరికారు, దొరికారు, దొరికారు" అని మళ్ళీ అమ్మ రాజశేఖర్ కామెడీగా చెప్పాడు. తర్వాత సుమ జీన్స్ మూవీలోని ఒక సాంగ్ కి డాన్స్ చేసి చూపిస్తూ కింద పడిపోయింది. "ఇది ఏజ్ తో వచ్చిన మోకాళ్ళ సమస్య లేదా నిజంగానే పడ్డానా" అని కామెడీ చేసి వెళ్లి వీల్ చైర్ లో కూర్చుంది. తర్వాత స్టూడెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చింది. తాను పడిపోయింది కాబట్టి ఎవరైతే తన ముందు డాన్స్ చేస్తారో వాళ్లనే పోటీలకు పంపిస్తాను అన్నట్టుగా చెప్తుంది.
తర్వాత రఘు మాస్టర్ కి తల్లిగా చేస్తుంది సుమ.."మీ అయ్యా రాక ముందే డాన్స్ ప్రాక్టీస్ చేసుకో..వస్తే గనక ఈ డాన్స్ ఏంటి ఏంటి అంటూ సోది మొదలుపెడతాడు" అని చెప్తుంది. ఇక రఘు కూడా తల్లి సుమ చెప్పినట్టే డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇక సుమ అన్నట్టుగానే అమ్మ రాజశేఖర్ రఘు మాస్టర్ కి తండ్రి రోల్ లో వెనక నుంచి కర్ర తీసుకొచ్చి కొడతాడు. "నాన్నకు డాన్స్ అంటే ఇష్టం ఉండదు అని తెలిసి ఎందుకు చేస్తున్నావ్" అని సుమ రఘు మాస్టర్ ని కావాలని కొడుతోంది. "డాన్స్ చేసుకో" అని అమ్మ రాజశేఖర్ పర్మిషన్ ఇచ్చేసరికి యాని మాస్టర్ తో కలిసి డాన్స్ చేస్తాడు రఘు మాస్టర్. ఇక వెనక మళ్ళీ అమ్మ రాజశేఖర్ వచ్చి "ఆపు డాన్స్ చేయడం" అంటాడు. "మీ డాడీనా ఆయన..మరేంటి పోలికలు లేవు" అని యాని అడిగేసరికి "అది కొంచెం ప్రాబ్లమ్స్" అని అమ్మ రాజశేఖర్ మళ్ళీ కామెడీ చేస్తాడు.
![]() |
![]() |